'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'పై రగడ: కోల్ కతాలో థియేటర్‌‌పై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

  • సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి
  • చూసిన మీదటే రిలీజ్ చేయాలి
  • చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ జీవితాధారంగా రాసిన పుస్తకం ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. తాము చూసిన మీదటే సినిమాను రిలీజ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయినా చిత్రబృందం ఇవేమీ పట్టించుకోకుండా శుక్రవారం ఈ చిత్రాన్ని విడుదల చేసింది. దీనిని చూసిన కాంగ్రెస్ కార్యకర్తలు చాలాచోట్ల నిరసన వ్యక్తం చేశారు.

ఇక కోల్‌కతాలోని ఓ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లోకి తమ పార్టీ జెండాలతో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు చిత్రం ప్రదర్శితమవుతుండగానే తెరపైకి వస్తువులను విసరడంతో తెర చిరిగిపోయింది. మరోపక్క ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారు. చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చిత్రంలో తమ పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లను తీవ్రంగా అవమానించారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు.
Go Back to Shorts
Manmohan Singh
The Accidental Prime Minister
Congress
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News